![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -658 లో.... అప్పు, కావ్యలు లిక్కర్ కమలేష్ కోసం వెతుకుతు ఉంటారు. తనే వచ్చి కావ్యని మందుకి డబ్బు అడుగుతాడు. కావ్య ఇచ్చి పంపిస్తుంది. వెంటనే లిక్కర్ కమలేష్ అతనే అయి ఉంటాడనుకొని మళ్ళీ వెళ్లి మాట్లాడుతారు. మరొకవైపు నేను ఏం తప్పు చెయ్యలేదు. అంతా ఆ అనామిక చేసిందని రాజ్ చెప్తాడు. కానీ అందుకు సంబందించిన సాక్ష్యాలు ఎవరు చూపించరు.
కమలేష్ ఆ రోజు రాత్రి రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్తాడు అక్కడ ఏం జరిగిందని, అక్కడికి ఎవరు వచ్చారని కావ్య, అప్పులు అడుగుతారు. నీకు డబ్బు ఇచ్చిన అతను ప్రాబ్లమ్ లో ఉన్నాడు. నువ్వు వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పాలని కావ్య చెప్పగానే.. సరేనని కమలేష్ అంటాడు. కోర్ట్ లో రాజ్ కి వ్యతిరేకంగా ఉంటుంది. అప్పుడే కావ్య, అప్పు లు కమలేష్ ని తీసుకొని ఎంట్రీ ఇస్తారు. ఆఫీస్ దగ్గరికి రాజ్ వచ్చి లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకొక కార్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి ఉంది. కొంతమంది ఉన్నారని చెప్తాడు. నువ్వు ఒక తాగుబోతువి నీ మాటలు ఎందుకు నమ్మాలని అనామిక లాయర్ అనగానే.. నేను వీడియో తీసానంటూ చూపిస్తాడు.
ఆ వీడియోని అందరి ముందు ప్లే చేస్తారు. రాజ్ లోపలికి వెళ్ళాక అనామిక కొంతమంది రౌడీలతో వచ్చినట్లు ఉంటుంది. దాంతో అక్కడకు ఎందుకు వెళ్ళావ్.. నిజం చెప్పకపోతే నీకు శిక్ష పడుతుందని జడ్జ్ అనగానే అనామిక జరిగింది చెప్తుంది. అనామిక, సామంత్ లకి గొడవ జరుగుతుంది. సామంత్ ని రాడ్ తో అనామిక కొట్టిచంపినట్లు చెప్తుంది.తరువాయి భాగంలో అనామికకి జైలు శిక్ష పడుతుంది. మిమ్మల్ని వదిలి పెట్టనని రాజ్ వాళ్ళకి చెప్తుంది అనామిక. మళ్ళీ ఈ కుటుంబంలోకి మరొక సమస్య ఏ రూపంలో వస్తుందోనని రుద్రాణి అంటుంది. అప్పుడే ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |